మణిపుర్‌పై 30 సెకన్లు మాట్లాడేందుకు మోదీకి 80 రోజులుఎందుకు పట్టింది? : గౌరవ్ గొగొయ్

-

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా.. ’లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ చర్చను ప్రారంభించారు.ఇంటెలిజెన్స్‌ వైఫల్యమే మణిపుర్‌ హింసకు కారణమని గొగొయ్ ఆరోపించారు. మణిపుర్‌పై 30 సెకన్లపాటు మాట్లాడేందకు మోదీకి 80 రోజులు ఎందుకు పట్టింది? అని ప్రశ్నించారు.

ఇంత జరిగినా మణిపుర్‌ సీఎంను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని నిలదీశారు. మణిపుర్‌ వీడియోలు బయటకు రాకుంటే మోదీ పెదవి విప్పేవారే కాదని అన్నారు. మణిపుర్‌లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయని అడిగారు. మణిపుర్‌ అంశంలో కేంద్రం, రాష్ట్రం వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని గుర్తు చేశారు.

‘ప్రధానికి మౌనంగా ఉండటం ఇదేమీ కొత్త కాదు. సాగుచట్టాలపై రైతుల ఆందోళన సమయంలోనూ ప్రధాని నోరు విప్పలేదు. అదానీ కంపెనీపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మోదీ నోరువిప్పలేదు. చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చినప్పుడు కూడా మోదీ మౌనం వహించారు. పుల్వామా దాడుల సమయంలోనూ మోదీ మౌనాన్నే ఆశ్రయించారు.’ అని గొగొయ్ మోదీపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news