ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు తన 48వ వడిలోకి అడుగుపెట్టాడు. ఇంత వయసు అవుతున్నా ఇప్పటికీ సంవత్సరాల వయసున్న వాడిలా చాలా యాక్టీవ్ గా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సూపర్ స్టార్ బిరుదును సార్ధకం చేసుకున్నాడు. చిన్న వయసులోనే బాలనటుడిగా 8 సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాగా ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా విషెస్ తెలియచేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాబుకు “అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ తెలిపారు. ఇంకా పవన్ తన మెసెజ్ లో మహేష్ ఒక హీరోగా అందుకున్న ఎన్నో విజయాలు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డాయి అని పేర్కొన్నారు.
ఎప్పుడూ మహేష్ బాబు ఆనందం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.