అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ

-

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా.. ’లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు చర్చ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగిస్తున్నారు. ప్రధాని మోదీ మణిపుర్ వెళ్లలేదని.. కానీ తాను వెళ్లానని రాహుల్ అన్నారు. భారత్​లో మణిపుర్​ లేకుండా మోదీ చేశారని విమర్శించారు. మణిపుర్ ప్రజలకు ప్రధాని మోదీ కనీస భరోసాను కల్పించలేక పోయారని మండిపడ్డారు.

‘బీజేపీ వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. అదానీ అంశంపై నేను ఈరోజు మాట్లాడను. ఈరోజు హృదయంతో మాట్లాడతాను. ఇటీవల నేను దేశం ఒక మూల నుంచి మరో మూలకు పాదయాత్ర చేశాను. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని చాలామంది నన్ను అడిగారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేయడం వెనుక నీ లక్ష్యం ఏంటని అడిగారు. భారత దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రజలను కలిసేందుకు పాదయాత్ర చేయాలనుకున్నా. పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ.. నాలో అహంకారం క్రమంగా మాయమైంది. పాదయాత్రలో రోజూ విభిన్న రంగాల వారిని కలిశాను.’ అని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news