భారత్​కు ట్రంప్ వార్నింగ్.. అధికారంలోకి వచ్చాక..?

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పని పడతానని వ్యాఖ్యలు చేశారు. భారత్​లో పన్ను రేట్లు అధికంగా ఉన్నాయంటూ మరోసారి ధ్వజమెత్తారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాను అధికారాలు చేపడితే అదే స్థాయిలో తాను భారతీయ వస్తువులపై పన్నులు విధిస్తానని హెచ్చరించారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సర్వేల ప్రకారం చూస్తే.. రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50 శాతానికి పైగా ట్రంప్​కే అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతున్న ట్రంప్.. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా పన్ను విధానాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్​ విధిస్తున్న పన్నులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news