భారతీయులు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం మరికొద్ది గంటల్లో రాబోతోంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యోమనౌక చంద్రయాన్-3 కొన్ని గంటల్లో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. ఈ అపురూప ఘట్టాన్ని దేశ ప్రజలంతా లైవ్లో వీక్షించేలా ఇప్పటికే ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది.
జులై 14న శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3.. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియో మీ కోసం..
షార్ వేదిక వద్ద చంద్రయాన్-3 ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన క్షణాలు.. భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారిన క్షణాలు ఈ వీడియోలో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉండటం కొసమెరుపు. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్ రోవడ్ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్ రూపంలో వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Chandrayaan-3 Mission🚀
Witness the cosmic climax as #Chandrayaan3 is set to land on the moon on 23 August 2023, around 18:04 IST.@isro pic.twitter.com/ho0wHQj3kw
— PIB India (@PIB_India) August 21, 2023