ఇండస్ట్రీలోకి రాకముందు నటుడు రావురమేష్ ఏం చేసేవారో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కొత్త బంగారులోకం సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు రావు రమేష్.. తను మొదటి సినిమాతోనే నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా .. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. పలు చిత్రాలలో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రావు గోపాల్ రావు కుమారుడే రావు రమేష్.. తన తండ్రి నటన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన.

సినిమా సినిమాకి తనలోని వేరియేషన్ చూపిస్తూ విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించగలిగే రావు రమేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏం చేసేవారో ఒకసారి తెలుసుకుందాం.. రావు రమేష్ శ్రీకాకుళంలో పుట్టి చెన్నైలో పెరిగారట. ఈయన నటుడు కావాలని ఎప్పుడూ ఆసక్తి చూపించలేదట. మధ్యలో చదువు ఆపేసి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకున్నారట రావు రమేష్.. అందుకే కాలిఫోర్నియా అకాడమీలో ఒక కోర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారట.

అయితే ఆ సమయంలోనే రావు గోపాల్ రావు మరణించడంతో తల్లి కూడా తనని నటన వైపు వెళ్ళమని రావు రమేష్ కి సలహా ఇచ్చిందట. ఇక ఇష్టం లేకపోయినా ఎన్నోసార్లు జాబ్ కోసం వెతికాడట రావు రమేష్.. అలాంటి సమయంలోనే నిర్మాణం వైపు అడుగులు వేయాలని ఒక నిర్మాత తో కలిసి సినిమాను తీశారు. అయితే కొన్ని కారణాల చేత అది మధ్యలో ఆగిపోవడంతో చాలా నష్టపోయాడట.. ఇక తర్వాత చేసేదేమీ లేక చెన్నైలో పుట్టగొడుగుల బిజినెస్ కూడా మొదలు పెట్టారట. ఇది కూడా ఫెయిల్యూర్ కావడంతో చివరికి తన తల్లి చెప్పిన మాట విని నటనవైపుగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు రావు రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news