తిరుమల నడక మార్గంలో ఫెన్సింగ్ .. హైకోర్టుకు చేరిన పంచాయితీ!

-

తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఇరువైపుల ఇనుప కంచె పంచాయితీ హైకోర్టు చేరింది. కంచె ఏర్పాటు చేసేలా రాష్ట్రప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. వన్యప్రాణుల దాడి నుంచి భక్తులను రక్షించేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిల్‌లో కోరారు.

టీటీడీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని భానుప్రకాశ్ పిటిషన్​లో కోరారు. కంచె ఏర్పాటు చేసి భక్తులను పులుల బారి నుంచి కాపాడాలని పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుతదాడి జరిగి రోజులు గడుస్తున్నా.. మెట్లమార్గంలో వెళ్తున్న భక్తుల్లో భయం తగ్గడం లేదు. ఓవైపు భయమున్నా.. స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్తున్నారు. అయితే చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నా.. అధికారులు సరైన చర్యలు మాత్రం చేపట్టడం లేదని భక్తులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news