అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెడుతున్న వర్మ ట్వీట్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తనకు సంబంధం లేని విషయాలలో కూడా తలదూరిస్తూ రకరకాల ట్వీట్ లు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో మెగా , అల్లు ఫ్యామిలీలను వర్మ టార్గెట్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొకసారి మెగా ఫ్యామిలీ పై ఉన్న తన అక్కసు వెళ్లగక్కాడు.

పుష్ప సినిమాలోని తన నటనతో భారీ స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి తాజాగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు లభించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలే కాదు వివిధ భాషా సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ మెచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే.. వర్మ మాత్రం విమర్శిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
అవకాశం వస్తే చాలు మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ని ఏకిపారేస్తున్నారు వర్మ అభిమానిని అని చెబుతూనే మరొక పక్క కౌంటర్లు వేస్తున్నాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జాతీయ అవార్డు తీసుకున్న వేళ విమర్శిస్తూ చేసిన ట్వీట్ అటు మెగా ఇటు అల్లు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. టాప్ హీరోలకు కొడుకుగా అయినా లేదా బ్రదర్ గా అయినా పుడితే ఇండస్ట్రీలో ఈజీగా విజయం సాధించవచ్చు. కానీ సూపర్ సక్సెస్ కావాలంటే మాత్రం కిందిస్థాయి నుంచి మొదలై అగ్రస్థానానికి చేరుకోవాలి. కానీ ఇక్కడ ఒక కమెడియన్ మనవడు అయినా కూడా సూపర్ హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద, అవార్డుల్లోనూ సంచలనం సృష్టించడమే మెగా సక్సెస్ అంటూ అటు మెగా,అల్లు ఫ్యామిలీలకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో మెగా అల్లు అభిమానులు వర్మపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఏదైనా స్పందిస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news