సెప్టెంబర్‌ 15న చంద్రముఖి.. కీలక వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ‘చంద్రముఖి2’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. ఆమె ట్రెడిషనల్ లుక్ వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ – కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి2’. 18 ఏళ్ల తరువాత ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అప్పట్లో చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ కు చంద్రముఖి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chandramukhi 2: Kangana Ranaut Looks Ethereal in First Look Poster of Her  Next (View Pic) | LatestLY

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ ‘‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ల‌లో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విష‌య‌మేమంటే.. నాకు అవకాశం కావాల‌ని ఎవ‌రినీ అడ‌గ‌లేదు. తొలిసారి డైరెక్ట‌ర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్ర‌తో పాటు ప్ర‌తీ పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయ‌న‌కే ద‌క్కుతుంది. లారెన్స్ మాస్ట‌ర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేష‌న్‌” అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news