తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తామని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ‘ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. తుమ్మల నాగేశ్వరరావును అవసరానికి వాడుకుని వదిలేసారు.
ఖమ్మం జిల్లాలో తుమ్మల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశారు. తుమ్మల, జలగం వెంకట్రావును సంప్రదిస్తాం. వారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం’ అని ఈటల వెల్లడించారు. ఇవాళ ఖమ్మంలో జరిగే రైతు కోస బిజెపి భరోసా సభలో కేంద్రమంత్రి అమిత్ షా రైతులకు భరోసా కల్పిస్తారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. BRS, BJP ఒక్కటేనన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన ఖండించారు. ఇటీవల పార్లమెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చట్టపట్టాలేసుకొని తిరిగారన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగులు, గిరిజనులు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.