రేపటి నుంచే ఆసియా కప్ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు.
నేటితో శిక్షణ శిబిరం ముగియనుండగా రేపు భారత జట్టు శ్రీలంక బయలుదేరనుంది. ఆసియాకప్ లో భాగంగా రేపు తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 2న పాక్ తో ఆడనుంది.
కాగా, టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారని, కానీ గెలవాలనే కోరిక ఫ్యాన్స్ కంటే ప్లేయర్లలోని ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని విరాట్ కోహ్లీ అన్నారు. ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘WC గెలవాలని నా కంటే ఎక్కువగా ఎవరూ కోరుకోరు. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఆ ఛాలెంజెస్ లో WC కూడా ఒకటి. ఛాలెంజెస్ ను మనం స్వీకరించాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవాలి’ అని తెలిపారు .