భగవంత్ కేసరి నుంచి ఫోటో లీక్.. అభిమానులు అనుకున్నది నిజమేనా..?

-

తాజాగా నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరొకవైపు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం కూడా ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న వేణు స్వామి కూడా ఇంకో రెండు సంవత్సరాలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో భగవంత్ కేసరి సెట్ నుంచి ఒక ఫోటో లీక్ అవడంతో అభిమానులు రకరకాలుగా ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లో మోక్షజ్ఞ కనిపించడంతో ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ప్రవేశం పై ఇప్పటికే ఎన్నో ప్రచారాలు జరిగాయి. త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా కామెంట్లు చేశారు. మరొకవైపు మోక్షజ్ఞ తొలి సినిమా యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుందని ఒకసారి.. లేదు యంగ్ టైగర్ తో కలిసి నటిస్తాడని మరొకసారి ప్రచారం జరిగింది. అంతేకాదు మంచి ప్రేమ కథాంశంతో మొదటి సినిమా చేస్తారని వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పటివరకు ఇందులో ఒక నిజం కూడా లేకపోయింది.

మోక్షజ్ఞ పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మోక్షజ్ఞ కూడా తరచూ తన తండ్రి బాలకృష్ణ షూటింగ్స్ స్పాట్ లకు వెళ్తూ నటనలో మెలుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే గతంలో వీరసింహారెడ్డి సెట్స్ లో సందడి చేసిన ఈయన ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి సినిమా సెట్ లో కనిపించారు . హీరోయిన్ శ్రీ లీలా, అనిల్ తో మోక్షజ్ఞ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో అభిమానులంతా మోక్షజ్ఞ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news