ఆసియా కప్ ఆరంభం మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు నేపాలు లు తలపడుతున్నాయి. పాకిస్తాన్ లోని ముల్తాన్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతుండగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచాలన్న ప్రయత్నం సక్సెస్ అయ్యేలా ఉంది. ఓపెనర్ లుగా వచ్చిన ఫఖార్ జమాన్ మరియు ఇమామ్ ఉల్ హాక్ లు స్వల్ప స్కోర్ కె వెనుతిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్ మరియు రిజ్వాన్ లు మూడవ వికెట్ కు పరుగులు జోడించారు.. ఆ తర్వాత ఆఘ సల్మాన్ కూడా త్వరగా అవుట్ అవడంతో బాబర్ తో కలిసిన ఇఫ్తికార్ అహ్మద్ అయిదవ వికెట్ కు ఏకంగా 214 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ దశలో బాబర్ ఆజామ్ 151 సెంచరీ సాధించాడు.. ఇఫ్తికార్ అహ్మద్ 109 పరుగులు చేశాడు.. చివరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. మరి ఈ స్కోరును నేపాల్ ఛేదిస్తుందా ?