BREAKING : టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్….

-

విశాఖ ఎయిర్‌ పోర్టులో TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలతో అదుపులో తీసుకున్న కృష్ణ జిల్లా పోలీసులు… విశాఖ ఎయిర్‌ పోర్టులో TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ చేసి..కృష్ణ జిల్లాకు తరలించారు. యువగళం గన్నవరం బహిరంగ సభ ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

మాజీమంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. రింగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారని కేసు నమోదు చేశారు.

అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బుద్దా వెంకన్న పై 153, 153a, 505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. సభా వేదిక నుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారంటూ ఆత్కూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు పేర్ని నాని. ఈ తరుణంలోనే..విశాఖ ఎయిర్‌ పోర్టులో TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news