పూర్వీకుల ఆస్తిపై వారసులకు హక్కు ఉంటుందా..? వారసత్వ ఆస్తి పూర్వీకుల ఆస్తికి తేడా ఏంటి..?

-

ఎలాంటి బంధాలు అయినా.. నమ్మకం కోల్పోయినప్పుడు చెదిరిపోతాయి. బంధాలు విడిపోవడానికి రెండో కారణం ఆస్తి తగాదాలు.. ఎంత చిన్నప్పటి నుంచి కలిసిపెరిగిన అన్నదమ్ములు, అక్కచెలెల్లు అయినా.. ఆస్తి విషయం వచ్చే సరికి పక్కాగా ఉంటారు. తేడాలొస్తే శాల్తీలు గల్లంతవుతాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో భాగం పొందే హక్కు ఉన్నాసరే కొందరు కుటుంబ సభ్యులను పక్కనపెట్టడంలో గొడవలు జరుగుతాయి. ఆస్తి వివాదాలకు సంబంధించిన కేసులలో ఈ పరిస్థితి తరచుగా ఎదురవుతుంది.

వారసత్వం, ఆస్తి హక్కుల కోసం చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించడం చూసే ఉంటారు. ఆస్తికి సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వీటిల్లో వివిధ చట్టపరమైన విషయాలు ఉంటాయి. కుటుంబంలోని తరతరాలుగా సంక్రమించిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి అంటారు.

చాలా సందర్భాల్లో పిల్లలను వారి తల్లిదండ్రులు వీలునామా(విల్‌)లో మెన్షన్‌ చేయరు. ‘పూర్వీకుల ఆస్తి తొలగింపు(Ancestral Property Eviction)’ ప్రిన్సిపుల్‌ ద్వారా పిల్లలను పూర్వీకుల ఆస్తి నుంచి పూర్తిగా మినహాయించకుండా నిరోధించడానికి చట్టంలో రక్షణలు ఉన్నాయి. పిల్లలను వీలునామాలో పేర్కొనకపోయినా, వారు కోర్టుకు వెళ్లి ఆ ఆస్తిలో తమ హక్కు వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చ.

హక్కులు ఎలా మారుతాయి? :

పూర్వీకుల ఆస్తి అనేది తాత, బామ్మ నుంచి లేదా అంతకు ముందు తరాల నుంచి సంక్రమించిన ఆస్తి. చట్టం ప్రకారం.. కుమారులు, కుమార్తెలు ఇద్దరికీ పూర్వీకుల ఆస్తిపై సమాన హక్కులు ఉంటాయి. ఇది ఇతర పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని కూడా కలిగి ఉంటుంది. ఆస్తిని పంచితే, అది పూర్వీకుల ఆస్తి నుంచి స్వీయ-ఆర్జితమైనదిగా మారుతుంది. అప్పుడు ఆస్తి నుంచి పిల్లలను మినహాయించే అధికారం తల్లిదండ్రులకు వస్తుంది. హిందూ వారసత్వ చట్టం 1956, ప్రత్యేకంగా సెక్షన్లు 4, 8, 19.. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలను నియంత్రిస్తుంది.

ప్రతి తరంలోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఎవరికైనా హక్కు ఉన్న పూర్వీకుల ఆస్తి వాటా మారవచ్చు. ఆస్తి విభజన ప్రతి వ్యక్తి ఆధారంగా కాదు, తండ్రి వీలునామాలో పేర్కొన్న భాగంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఏకైక సంతానం అయితే, వారు మొత్తం వాటాను వారసత్వంగా పొందుతారు. అనేక మంది తోబుట్టువులు ఉంటే, ఆస్తిని అందరికీ విభజిస్తారు.

వారసత్వ ఆస్తి ఏది? :

పూర్వీకుల, వారసత్వ ఆస్తి మధ్య తేడాను గుర్తించడం ముఖ్యం. చాలా మంది రెండూ ఒకటే అనుకుంటారు. తండ్రి వైపు నుంచి పొందిన ఆస్తిని పూర్వీకుల ఆస్తిగా పరిగణిస్తారు. ఇందులో వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా ఉండవచ్చు. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తి అంతా పూర్వీకుల ఆస్తి కాదు. తల్లి తరఫు మూలాల నుంచి సంక్రమించిన ఆస్తి, అంటే తల్లి తల్లిదండ్రులు, తోబుట్టువులు, లేదా తల్లి వైపు నుంచి వచ్చే బంధువుల నుంచి వచ్చిన దాన్ని వారసత్వంగా వచ్చిన ఆస్తిగా పరిగణిస్తారు.

సమాన హక్కులు :

తండ్రి తమ పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తిని విభజించాలని నిర్ణయించుకున్నప్పుడు, కొడుకులు, కుమార్తెలకు సమాన భాగాలుగా ఇవ్వాలి. 2005లో ఒక ముఖ్యమైన సవరణతో.. పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సైతం కుమారుల మాదిరిగా సమాన హక్కులు ఉంటాయని కోర్టులు తీర్పు చెప్పాయి.

Read more RELATED
Recommended to you

Latest news