లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. ఇండియా కూటమి తీర్మాణం..!

-

అధికార ఎన్డీఏ కూటమిని ఎలాగైనా ఓడించాలని ఇండియా కూటమి భావిస్తుంది. ఇండియా కూటమి భేటీ అయింది. ముఖ్యంగా 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే ఎన్నికల వరకు ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై ఆలోచనలు జరిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు తీర్మాణం చేశాయి. ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.

ఇండియా కూటమి సమన్వయ కమిటీలో కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత రాఘవ్ చడ్డా, సమాజ్ వాది పారట్ీ నుంచి జావెద్ అలీ ఖాన్, జూడీయూ నుంచి లలన్ సింగ్, సీపీఐ నేత డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news