‘హరిహర వీరమల్లు’ నుంచి పవన్ కళ్యాణ్ పోస్టర్ వచ్చేసింది

-

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా ‘హరి హర వీరమల్లు’. ఇందులో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.

అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ కోసం పవన్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news