ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గవర్నింగ్ బాడీ ద్వారానే ఫీజులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేసింది. వసూలు చేసిన ఫీజులో 5% మాత్రమే లాభం తీసుకోవాలని హెచ్చరించింది కేసీఆర్ సర్కార్.
50% సిబ్బందికి జీతాలు ఇవ్వాలె.. 15% ఫీజు స్కూల్ నిర్వహణకు వాడుకోవాలని… ఫీజుల వివరాలను స్కూల్ వెబ్ సైట్లలో, డైరెక్టరేట్ వెబ్ సైట్లో పెట్టాలని పేర్కొంది. స్టేట్ గవర్నమెంట్ తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఐజీసీఎస్ఈ స్కూళ్లలోనూ ఫీజులు నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. హై కోర్టు కేసు నుంచి తప్పించుకునేందుకు మెమో ఇచ్చి చేతులు దులుపుకుందని అంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్. చట్టం ద్వారానే ఫీజులను నియంత్రించొచ్చు అంటున్నారు పేరెంట్స్.