ఇండియా VS నేపాల్: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే సూపర్ 4 కు ఎవరు వెళ్తారు !

-

ఆసియా కప్ లో మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. మొదటి గ్రూప్ లో ఇండియా , పాకిస్తాన్ మరియు నేపాల్ లు ఉండగా … రెండవ గ్రూప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ లు ఉన్నాయి. కాగా ఇండియా ఉన్న గ్రూప్ లో ఇప్పటికే పాకిస్తాన్ నేపాల్ పై మొదటి మ్యాచ్ ను గెలుచుకుని మరియయు ఇండియా తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా 3 పాయింట్ లతో సూపర్ 4 కు దూసుకు వెళ్లగా, మిగిలిన రెండు జట్లు ఇండియా 1 పాయింట్ తో మరియు నేపాల్ 0 పాయింట్ లతో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సూపర్ 4 కు అర్హత సాధిస్తుంది, ఓడిన జట్టు లీగ్ నుండి నిష్క్రమిస్తుంది. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ ఫలితం తేలే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా ఇండియా ఛేజింగ్ ఆగిపోయింది.. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేయగా, ఇండియా 17 పరుగుల వద్ద ఉండగా భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఇప్పుడు వర్షం వలన మ్యాచ్ పూర్తిగా రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

అప్పుడు ఇండియా 2 పాయింట్లు తెచ్చుకుంటుంది.. నేపాల్ కు కేవలం ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ తో కలిసి సూపర్ 4 కు వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news