BREAKING : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వినయ్ భాస్కర్‌

-

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య..కాంగ్రెస్‌ పార్టీకి టచ్‌ లో ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అలర్ట్‌ అయింది. ఇందులో భాగంగానే.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌, ఉద్యమకారుడు మర్రి యాదవ రెడ్డితో కలిసి వెళ్లారు.

Vinay Bhaskar at station Ghanpur MLA Rajaiah's house
Vinay Bhaskar at station Ghanpur MLA Rajaiah’s house

హనుమకొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్‌ హనుమకొండ లోని ఎమ్మెల్యే రాజయ్య ఇంట్లో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగిన మాదిగ మేధావుల సదస్సులో కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో ఎమ్మెల్యే రాజయ్య కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రాజనర్సింహ రాజయ్యల భేటీ ఒక్కసారిగా రాజకీయంగా హీట్ హీట్ పుట్టించింది. ఎమ్మెల్యే రాజయ్య అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయా అనే ప్రచారం జరిగిందని ఈ తరుణంలోనే…బీఆర్‌ఎస్‌ పార్టీ అలర్ట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news