ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం ఆలస్యం కావడం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. విశాఖలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదు అని.. కొందరూ విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఉపాధ్యాయులకు వేతనాలు ఆలస్యం అయ్యాయని వెల్లడించారు.
సెప్టెంబర్ 07 లేదా 08 తేదీలలో ఉపాధ్యాయుల ఖాతాలో వేతనాలను జమ చేస్తామని తెలిపారు. గతంలో విద్యాసంస్థ గురించి వస్తే.. కేరళ, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుకునేవారని అన్నారు. ఇవాళ దేశం మొత్తం ఏపీ విద్యావ్యవస్థ గురించి మాట్లాడుకుంటుందని అన్నారు. సీఎం జగన్ విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పలు సంక్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలను ప్రశంసించారని చెప్పారు.