ప్రేమోన్మాది ఘాతుకం.. బ్లేడుతో ప్రేయసి గొంతు కోసిన వైనం..!

-

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై బ్లేడ్ తో దాడి చేశాడు ప్రియుడు. ఈ ఘటన విశాఖపట్టణం పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 59వ వార్డు నెహ్రునగర్ ప్రాంతంలో లలిత శ్రీ(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావు(26) ఉంటున్నాడు. ఇరురువు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రామారావు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడం లలితకి నచ్చలేదు.

అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. పెళ్లి చేసుకోవాలని గత కొద్ది రోజులుగా ఒత్తిడి తీసుకువస్తున్నా.. ఆమె ససేమిరా అంది. సోమవారం రాత్రి భోజనం చేసి ఆమె మేడపై వాకింగ్ చేస్తున్న ఆమె వద్దకు మరో సారి వెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో వెంట తీసుకొచ్చిన బ్లేడ్ తో దాడి చేస్తానని భయపెట్టాడు. అయినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో బ్లేడ్ తో గొంతు భాగంలో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బంధువులు అక్కడికి చేరుకొని గాయపడిన లలిత శ్రీని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news