రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్సై సస్పెండ్..!

-

డ్రగ్స్ కేసులో రోజుకొక సంచలన ఘటన చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ని ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పట్టివేతలో రాజేందర్ చేతివాటం ప్రదర్శించాడు. పట్టుబడిన డ్రగ్స్ లో కొంత మేరకు దాచి అమ్ముకునేందుకు యత్నించాడనే నెపంతో ఉన్నతాదికారుల విచారణలో ఎస్సై అవినీతి బయటపడటంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రాజేందర్ పై కేసు నమోదు అయింది. ఆగస్టు 27న  ఎస్సైని  అరెస్టు చేశారు. 

రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఎస్ ఐ రాజేందర్ ను తాజాగా సస్పెండ్ చేశారు  సైబరాబాద్ పోలీస్ కమిషన్ సీపీ.  నైజీరియన్ వ్యక్తి వద్ద నుంచి 1750 మాదకం ద్రవ్యాలను పట్టుకున్నాడు. కోర్టులో సబ్ మిట్ చేయకుండా తన వద్దే ఉంచుకున్నాడు. రూ.80లక్షల విలువైన మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేసింది. కోర్టు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనుంది. విచారణ చేసిన తరువాత మళ్లీ జైలుకు తరలించారు. శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎవరికైనా మాదక ద్రవ్యాలను ఎందుకు విక్రయించనున్నారు డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్ టీమ్ కి చిక్కిన రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news