శ్రీలంకతో ఓటమిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రషీద్ ఖాన్ !

-

నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో గెలిచి శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. చివరిలో జరిగిన హై డ్రామా కారణంగా ఆఫ్గనిస్తాన్ గెలవాల్సిన మ్యాచ్ ను కాస్తా ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. కానీ ఆఫ్ఘన్ మొదటి నుండి ఆడిన తీరును చూస్తే, ఎవ్వరూ ఓడిపోతుంది అనుకోరు. దాదాపుగా శ్రీలంక కు చాలా కలం గుర్తుండిపోయే ఓటమిని రుచి చూపించేలా కనిపించిన కీలక సమయంలో వికెట్ పాడడం ఆ జట్టుకు శాపం గా మారింది. ఫలితంగా రెండు పరుగుల తేడాతో ఓడిపోయి ఆఫ్ఘన్ అభిమానులకు బాధను మిగిల్చింది. ఇక తాజాగా ఈ ఓటమిపై ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఒక ఆట అన్న తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.. కానీ అన్నిటినీ చూసుకుంటూ, ఓటమి పాటల నుండి ఇంకా నేర్చుకుని మళ్ళీ రెట్టించిన ఉత్స్సహంతో తిరిగిరావాలి అంటూ పోస్ట్ చేశాడు.

ఇక ఆఫ్గనిస్తాన్ ను ప్రతిక్షణం సపోర్ట్ చేస్తున్న అభిమానులు అందరికీ థాంక్స్ చెప్పాడు రశీద్ ఖాన్. ఇక వరల్డ్ కప్ లో అయినా సంచలన ప్రదర్శనతో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news