‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఉట్ల పండుగ”గా పిలుచుకుంటూ యువతి, యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.
శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం తెలిపారు. భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సీఎం ప్రార్థించారు.
తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ హాలిడే. ఇవాళ ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా తోలుత ఈనెల 6న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. తాజాగా ఆ సెలవును 7వ తేదీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఇవాళ సెలవు ఉండనుంది.