BREAKING : బాత్రూంలో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

-

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లోకాయుక్త భవనంలో కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సి 2451) తుపాకీతో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. కర్నూల్‌ లో ఉన్నటు వంటి లోకాయుక్త భవనంలో బందోబస్తుగా విధినిర్వహణలో ఉండి ఆత్మహత్య చేసుకున్నారు కానిస్టేబుల్‌ సత్యనారాయణ.

Constable commits suicide by firing gun in Lokayukta building
Constable commits suicide by firing gun in Lokayukta building

గత కొన్నిరోజులుగా లోకాయుక్త కు బందోబస్తుగా ఉంటున్నాడు సత్యనారాయణ. అయితే.. తాజాగా ఎస్ ఎల్ ఆర్ తో… బాత్రూమ్ లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సత్యనారాయణ. సత్యనారాయణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కుమార్తె చేస్తున్నది. ఇక సత్యనారాయణ ఆత్మహత్యకు కారణాలపై విచారిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news