ఇంగ్లాండ్ పై కివీస్ అలవోక విజయం … కాన్ వే , మిచెల్ సెంచరీలు !

-

నిన్న ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే లో టామ్ లాతమ్ సేన అలవోక విజయాన్ని అందుకుని వన్ డే సిరీస్ లో అధిక్యానికి వెళ్ళింది. మొదట టాస్ గెలిచినా కివీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బట్లర్, మలన్, స్టోక్స్ మరియు లివింగ్ స్టన్ లు హాఫ్ సెంచరీ లతో రాణించారు, అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ శ్రమించకుండానే మరో 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని మరో ఎనిమిది వికెట్లు చేతిలో ఉండగానే సాధించింది.

ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్ కాన్ వే (111) మరియు సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన డారిల్ మిచెల్ (118) లు సెంచరీ లతో కదం తొక్కడంతో కివీస్ కు సునాయాస విజయం దక్కింది. ఇంగ్లాండ్ బౌకలేర్లలో రషీద్ మరియు విల్లీ లు చెరో వికెట్ అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news