ఈ నెల 12వ తేదీన బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు చీకోటి ప్రవీణ్. తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో పార్టీలో చీకోటి ప్రవీణ్ జాయిన్ అవ్వనునట్లు సమాచారం అందుతోంది. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి భారీ ర్యాలీ తో వచ్చి.. బీజేపీ లో చీకోటి ప్రవీణ్ చేరనున్నట్లు సమాచారం అందుతోంది.
అంతేకాదు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చీకోటి ప్రవీణ్ పోటీ చేయనున్నారని సమాచారం. హైదరాబాద్ లోని ఓ నియోజక వర్గం చీకోటి ప్రవీణ్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో ఉన్న చీకోటి ప్రవీణ్ క్యాసినో కింగ్ గా మరియు జంతు ప్రేమికుడిగా చాలా ఫేమస్ అని తెలిసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యన బ్యాంకాక్ లో జరిగిన మనీ లాండరింగ్ కేసు లోనూ చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు. కాగా ఇటీవల లాల దర్వాజా అమ్మవారి బోనాల సందర్భంగా గుడికి వెళ్లిన చీకోటి ప్రవీణ్ గన్ మెన్ లు ఎటువంటి అనుమతి తీసుకోకుండా లోపలకు గన్ లతో పాటు రావడంతో వివాదం అయింది.