BREAKING : చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు అరెస్ట్ టిడిపి అధినేత చంద్రబాబు A-1గా ఉన్నారని తోలుత వార్తలు వచ్చాయి. అయితే సిఐడి అధికారులు తాజాగా విజయవాడ ACB కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో A-37గా చంద్రబాబుని పేర్కొనగా…A-1గా గంట సుబ్బారావు పేరును చేర్చారు.
నిధుల మళ్లింపుపై ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సిఐడి పేర్కొంది. కాగా, ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు.. ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సీఐడీ సిట్.. రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించింది. ఈ తరుణంలోనే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో మెమో వేసిన సీఐడీ సిట్.. ఓపెన్ కోర్టులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.