Prabhas :పాన్ ఇండియా సినిమాలో శివుడిగా ప్రభాస్..!

-

ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత భారీ బడ్జెట్ లతో రిలీజ్ అయిన మూడు సినిమాలు సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే ఇక మీదట వచ్చే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభాస్ అండ్ టీం.

ఇక ఈ తరుణంలోనే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీడ్ రోల్ లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా… మంచు విష్ణు నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో మంచు విష్ణు, నుపూర్ సనన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. కాగా ప్రభాస్ ఇటీవల నటించిన… ఆది పురుష్ సినిమా అంతంత మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆది పురుష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news