అరెస్ట్ వల్ల చంద్రబాబు శని పోతుంది – సీపీఐ నారాయణ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జగన్ బలమైన పార్టీ గానే ఉన్నాడు కానీ పోలవరం, కడప స్టీల్ ఫ్యాక్టరీ పోయిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందని మండిపడ్డారు. జగన్ మీద కేసులు ఉండడం వల్లనే ఆయన బిజెపికి సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు.

14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రులను నియమించే స్థాయికి వెళ్లారని.. కానీ నేడు ఆయనని ఆధారాలు లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ సిఐడి ముసుగులో గుండాలు అరెస్టు చేసిన విధంగానే ఉందన్నారు. ఈ అరెస్టు వల్ల చంద్రబాబు శని పోతుందని అన్నారు నారాయణ. ఇకనుంచి వైసీపీ పతనం స్టార్ట్ అయింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news