ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్స్‌ అయితే… ఇలా రివైవల్‌ చేసుకోవచ్చు..!

చాలా రకాల పాలసీలు ఉంటున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకు వస్తూ వుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ ని కనుక తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. రిస్క్ కూడా ఉండదు. అయితే ఈ పాలసీని యాక్టివ్‌గా ఉంచడానికి జీవిత బీమా పాలసీ ప్రీమియంలను చెల్లించడం చాలా అవసరం. వరుసగా మూడు ప్రీమియంలు కట్టకపోతే పాలసీ రద్దు అవుతుంది. బీమా చేసిన వ్యక్తి సకాలంలో లేదా గ్రేస్ పీరియడ్‌లో ప్రీమియంలని చెల్లించాలి. ల్యాప్స్ అయిన ఎల్‌ఐసీ పాలసీని పునరుద్ధరించాల్సిన అవసరం వుంది.

పాలసీ కనుక ల్యాప్స్ అయితే బీమా పథకానికి సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలకు బీమా చేసిన వ్యక్తికి అర్హత లేదు. మళ్ళీ అతను పాలసీని పునరుద్ధరించడం చాలా అవసరం. ఎల్‌ఐసీ దాదాపు రెండు సంవత్సరాల వ్యవధిలో లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి ఛాన్స్ ఇస్తుంది. ఇక మరి అది ఎలా చెయ్యాలో చూద్దాం. పాలసీదారు ఇంటిమేషన్ తేదీని మార్చవచ్చు. అలాగే పునరుద్ధరణ సమయంలో వయసు బట్టీ ప్రీమియం పే చేయాలి. ల్యాప్స్ అయిన బీమా పాలసీని పదవీ కాలంలో ఒకసారి పునరుద్ధరించవచ్చు.

ప్రత్యేక పునరుద్ధరణ పథకం కింద పాలసీదారు ఇంటిమేషన్ తేదీని చేంజ్ చేసుకోవచ్చు. పునరుద్ధరణ సమయంలో వయస్సు ప్రకారం ఒక ప్రీమియం చెల్లించవచ్చు. ల్యాప్స్ అయిన బీమా పాలసీని పదవీ కాలంలో ఒకసారి పునరుద్ధరించవచ్చు. పాత, కొత్త ప్రీమియం మధ్య ఛార్జీని చెల్లించాలి. అదే వాయిదాల పునరుద్ధరణ పథకం అయితే వాయిదాల్లో కట్టచ్చు.