రోడ్లపై ఏరులై పారిన వైన్‌.. ఎక్కడో తెలుసా..?

-

భారీగా వాన కురిసినప్పుడు వరద నీరు చేరి రహదారులు చెరువులను తలపించడం కామన్. నీరు ఏరై పారుతోంది అంటుంటాం ఇలాంటి సందర్భాల్లో. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఏకంగా వైన్ ఏరులై పారుతోంది. వీధుల గుండా చెరువులను తలపిస్తూ ప్రవహిస్తోంది. అదేంటి.. వైన్ ఏరులై పారడమేంటి అనుకుంటున్నారు కదూ. వినడానికి వింతగా ఉన్నా… పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలో నిజంగానే వైన్ ఏరులై పారింది. అసలేం జరిగిందంటే..?

ఈ పట్టణ సమీపంలో లెవిరా డిస్టిలరీ (ఆల్కహాల్‌ తయారీ కేంద్రం) ఉంది. అయితే తాజాగా ఈ కేంద్రం నుంచి 2 మిలియన్‌ లీటర్ల రెడ్‌ వైన్‌తో ఉన్న బారెల్స్‌ను వేరొక చోటుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఆ బారెల్స్‌ పగిలిపోయాయి. అంతే ఇక.. ఆ వైన్ అంతా పట్టణంలోని వీధుల్లో ఏరులై పారింది. రహదారులను చెరువుల్లా తలపించేలా రెడ్ వైన్ ప్రవహించింది. స్థానికులు ఈ ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

ఒలింపిక్‌ స్విమ్మింగ్‌పూల్‌ను నింపేంత వైన్‌ వీధుల వెంట ప్రవహించింది. సమాచారం అందుకున్న అధికారులు రెడ్‌ వైన్‌ ప్రవాహాన్ని స్థానిక నదిలో కలవకుండా.. వేరే ప్రాంతానికి మళ్లించినట్లు స్థానిక మీడియా వార్తలు ప్రచురించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news