చంద్రబాబు అరెస్ట్‌ చట్ట విరుద్ధం: అఖిలేశ్‌ యాదవ్

-

స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్‌ వేయగా, హౌస్‌ రిమాండ్‌ తదితర అంశాలతో చంద్రబాబు పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలు ముగిశాయి. తీర్పు వెలువడాల్సి ఉంది.

మరోవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలో టీడీపీ నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకం పలు పార్టీల నేతలు నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు జాతీయ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చంద్రబాబు అరెస్టును ఖండించారు. యనమలకు ఫోన్ చేసిన అఖిలేష్.. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని అన్నారు. బాబు కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పారు.

మరోవైపు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా నారా లోకేశ్​కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news