సీఐడీ, స్కిల్ డెవల్మెంట్ చైర్మన్ ను ప్రతి వాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరుగనుంది. మరోవైపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ పిటిషన్ ను హౌస్ అరెస్ట్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ అవసరం లేదంటూ.. అడ్వకేట్ జనరల్ కి లేఖ రాశారు ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్. చంద్రబాబుకు జైలులో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మూడు కేసుల్లో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో తనపై సీఐడీ నమోదు చేసిన FIR ను కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు. చంద్రబాబు పై మూడు కేసులు నమోదయ్యాయి. అన్ని పరిశీలించారు. వాటన్నింటిని బెయిల్ అప్లై చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కేసులో, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కి సంబంధించిన కేసు, విజయనగరంలో దాఖలు అయిన బెయిల్ తీసుకునేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.