తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే టికెట్ల విషయం పై ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 115 మందికి టికెట్లను కూడా కేటాయించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోటిఫికేషన్ వేసి దరఖాస్తు చేసుకుని ఎంపిక చేయనున్నారు. కాంగ్రెస్ నోటిఫికేషన్ కి డబ్బులు చెల్లించగా.. బీజేపీ మాత్రం ఎలాంటి డబ్బులు లేకుండా ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు నోటిఫికేషన్, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలా ఎవ్వరికీ వారు ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ప్రచారం చేస్తున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయానికి ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ లో కూడా ఎన్నికలు మే నెలలోనే జరుగుతాయని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశంలో ఓ క్లారిటీ వస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.