కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానన్న వాగ్దానాన్ని 2014లో నెరవేర్చారు. తెలంగాణలో పార్టీకి నష్టం జరిగినప్పటికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. అలాగే ఇవాళ హైదరాబాద్ నగర శివారుప్రాంతంలోని తుక్కుగూడలో టీ కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సోనియా సభా ముఖంగా 6 వాగ్దానాలను ప్రకటించనున్నారు.
1. మహాలక్ష్మీ 2. రైతు భరోసా 3. రాజీవ్ యువ వికాసం, 4. అంబేద్కర్ అభయ హస్తం, 5. చేయూత 6. మహిళా సాధికారత.
మహిలక్ష్మీ పథకం.. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్, రైతు భరోసా ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం మొదటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంబేద్కర్ అభయ హస్తం – ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, చేయూత – ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుచేసుకున్న వారికి రూ.5లక్షలఆర్థిక సహాయం. మహిళా సాధికారత- బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.3వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ ఆరు పథకాలను సోనియాగాంధీ ఇవాళ మరికొద్ది సేపట్లో విజయభేరీ సభలో ప్రకటించనున్నారు.