థర్డ్‌ఫ్రంట్‌కు కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని ఆశిస్తున్నా.. ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్ర‌తిప‌క్షాల ఇండియా కూటమిలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందకపోవడంపై తాను పట్టించుకోవడం లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ ఫ్రంట్ గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. థ‌ర్డ్ ఫ్రంట్ కు అవ‌కాశ‌ముంద‌ని.. దీనికి భార‌త రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు నాయకత్వం వహిస్తారని ఆశిస్తున్నాన‌ని చెప్పారు ఒవైసీ.


థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయనీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. దీనిని ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించాల‌ని కోరుతున్న‌ట్టు పేర్కొన్నారు. “థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలు ప్ర‌తిప‌క్ష కూటమి ఇండియాలో లేరు. సహేతుకమైన ఉనికి ఉన్న పార్టీలు కూడా ఎన్డీయే, ఐఎన్డీ కూటమిలో లేవు. కాబట్టి, కేసీఆర్ చొరవ తీసుకొని తేడాను చూస్తారని నేను ఆశిస్తున్నాను” అని ఒవైసీ అన్నారు. అలాగే, కేసీఆర్ నాయకత్వం వహిస్తే రాజకీయ శూన్యత భర్తీ అవుతుందనీ, ఇండియా కూటమి ఈ శూన్యతను పూరించలేకపోయిందని కూడా అన్నారు. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందకపోవడంపై తాను పట్టించుకోవడం లేద‌ని స్ప‌ష్టం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news