విజయభేరి సభలో ‘మహాలక్ష్మి పథకం’ ప్రకటించిన సోనియా గాంధీ

-

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సోనియా.. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారెంటీలు ఇస్తున్నామని సోనియా గాంధీ తెలిపారు. ఒక్కో గ్యారెంటీని తమ పార్టీలోని ఒక్కో అగ్రనేత ప్రకటిస్తారని చెప్పారు. మొదటగా తాను మహాలక్ష్మి పథకాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. మరోవైపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వివరించారు.

విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం

రైతుభరోసా పథకం

గృహజ్యోతి పథకం

ఇందిరమ్మ ఇంటి పథకం

యువవికాసం పథకం

చేయూత పింఛను పథక.. ఈ ఆరు పథకాలను ఒక్కో అగ్రనేత ప్రకటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news