రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ : సోనియా గాంధీ

-

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తరువాత తెలంగాణ పైన ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాలను సైతం హైదరాబాద్ వేదికగా నిర్వహించటం ద్వారా తెలంగాణ ఎన్నికలకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సోనియా గాంధీ..ఇప్పుడు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మరో ఆరు గ్యారంటీ స్కీంలతో ప్రజల మధ్యకు వస్తున్నారు.

తెలంగాణ పార్టీ నేతలకు సోనియా రోడ్ మ్యాప్ - వారికి గ్రీన్ సిగ్నల్..!! | Sonia gandhi directs road map for TPCC ahead Asembly Elections, to foucs on Gurantee schemes - Telugu Oneindia

ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ఇచ్చిన తాము..రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరిలో పాల్గొన్న ఆమె..ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు ఎంతో శుభదినమని..నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజని చెప్పారు. ఇంతటి గొప్ప రోజున ఆరు గ్యారెంటీలను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు సోనియా గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తన కల అని చెప్పారు. ఆ కలను నేరవేర్చాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోయిన్ పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్, ట్రైనింగ్ సెంటర్ కు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు.

సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీలు

మహాలక్ష్మి పథకం .. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం.
రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
ఇందిరమ్మ ఇండ్లు .. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం
ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు
రైతుభరోసా రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం.
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
గృహజ్యోతి… ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
యువ వికాసం.. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు.
చేయూత .. నెలకు రూ. 4,000 చొప్పున పింఛను.
రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా

Read more RELATED
Recommended to you

Latest news