తిరుపతిలో సీఎం జగన్ పర్యటించారు. ఇవాళ శ్రీనివాస సేతు ప్లై ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. నాలుగేళ్లలో ప్రజలకు ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. శ్రీనివాస సేతు ప్లై ఓవర్ తో తిరుపతి వాసులకు, భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ.684 కోట్లతో శ్రీనివాస సేతు ప్లై ఓవర్ నిర్మించినట్టు తెలిపారు సీఎం జగన్.
అదేవిధంగా ఎస్వీఆర్ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనంలో మరిన్ని సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు.
అత్యంత సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగస్తులందరికీ 6,700 మందికి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్ల వ్యయంతో 3500 మంది పట్టాలు కూడా 45 రోజుల్లోపు అందుతాయని తెలిపారు. అనంతరం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో టీటీడీ ఉద్యోగుల చిరుకార స్వప్నం సాకారమైంది. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందుతాయని సీఎం జగన్ వెల్లడించారు. ఇవాళ రాత్రి 8 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం జగన్.