నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి : ఎంపీ నామా

నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు.ఇద్దరూ ఎంపీలతో కేసీఆర్ లోక్ సభలో అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు. కొత్త పార్లమెంట్ లోనైనా మహిళా బిల్లు, ఓబీసీ బిల్లులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు చేదు అనుభవం మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కానీ నేడు తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తుకు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు అని.. తెలంగాణలో సచివాలయంలో 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిందని.. నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.