PGECET : నేటి నుంచి PGECET తుది విడత వెబ్ కౌన్సెలింగ్

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. TS PGECET తుది విడత వెబ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీని ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుండగా, ఈనెల 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ మూడున సీట్లను కేటాయించనున్నారు.

PGECET final phase web counseling from today
PGECET final phase web counseling from today

7,922 కన్వీనర్ కోటా సీట్లలో 5,662 సీట్లు మొదటి విడతలో భర్తీ కాగా, 3,638 మంది కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. మిగతా సీట్లను తుది విడతలో భర్తీ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా DSC ద్వారా భర్తీ చేయనున్న టీచర్ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలతో పాత రోస్టర్ కు ముగింపు పలికిన ప్రభుత్వం రోస్టర్ ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్లను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో చూడవచ్చు. 5,089 పోస్టుల్లో 2,638 పోస్టులను మహిళలకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news