తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DSC ద్వారా భర్తీ చేయనున్న టీచర్ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలతో పాత రోస్టర్ కు ముగింపు పలికిన ప్రభుత్వం రోస్టర్ ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్లను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో చూడవచ్చు. 5,089 పోస్టుల్లో 2,638 పోస్టులను మహిళలకు కేటాయించారు.
కాగా… ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన టిఆర్టి నోటిఫికేషన్ కు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 503 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈనెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాటు చేసింది.