మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ బెయిల్‌ రద్దు చేయాలని కౌంటర్‌

-

హైదరాబాద్​లో డ్రగ్స్ సరఫరా కేసు కలకలం రేపుతోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుల విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నిందితుల సెల్​ఫోన్ డేటాలో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. వారి మొబైల్ డేటాలో సినీ ప్రముఖుల కాంటాక్టులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Hearing on Navadeep's petition in High Court today

అయితే ఈ వ్యవహారంలో హీరో నవదీప్ కూడా భాగమైనట్టు పోలీసులు ఇటీవలే గుర్తించారు. మాదక ద్రవ్యాల ముఠాతో నవదీప్​కు సంబంధాలున్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ 29 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు వివరించారు. అయితే ఈ కేసులో ఇరుక్కున్న నవదీప్ తెలంగాణ హైకోర్టులో ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టులో నార్కోటిక్‌ విభాగం పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. డ్రగ్స్‌ సరఫరా చేసే రాంచందర్‌తో నవదీప్‌కు సంబంధాలున్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. నార్కోటిక్‌ విభాగం పోలీసులు కౌంటర్‌లో ఆధారాలను పొందుపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news