BREAKING : బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ ఫోన్ లాక్కున్నారు మంచు మోహన్ బాబు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఇవాళ ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్‌చరణ్, మహేష్‌బాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర మైన విషయం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం జరుగుతుండగా… జయసుధ ఫోన్ పట్టుకుని చూస్తున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన మోహన్ బాబు.. ఆ ఫోన్ లాక్కొని.. సైలెంట్ గా కూర్చొమని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు#ANRLivesOn pic.twitter.com/wfoKg5zxWu
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2023