ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును సిఐడి కస్టడీ లోకి కూడా తీసుకోవాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం తో మరో షాక్ తగిలింది. ఇక చంద్రబాబును ధనుంజయ నేతృత్వంలోని టీం విచారణ చేయనుంది.. ఈ టీం లో మొత్తం 9 మంది అధికారులు ఉండనుండగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారించనున్నారు. ఏసీబీ టీం చంద్రబాబు ఉండే బ్యారక్ ప్రాంతంలోనే ఒక స్పెషల్ రూమ్ లో విచారణ చేస్తారని తెలుస్తోంది. ఇక ఏసీబీ కోర్ట్ సైతం ఒక నిబంధనను చంద్రబాబు తరపు లాయర్ కు తెలియ చేసింది. ఈ విచారణ జరగనున్న సందర్భంలో చంద్రబాబు లాయర్ ఉండాల్సిన అవసరం లేదని ఏసీబీ జడ్జి ఆదేశించడం జరిగింది.
ఇక ఈ విచారణ జరుగుతుండగా మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చిన సమయంలో మాత్రమే చంద్రబాబును లాయర్ కలిసే ఛాన్స్ ను ఇవ్వాలని కోరారు. కాగా ఇప్పుడు దేశం మొత్తం కూడా విచారణలో ఎటువంటి విషయాలు బయటపడనున్నాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.