టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ అచ్చెన్నాయుడు, భువనేశ్వరి, బ్రాహ్మణిలు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు. ఫైల్ అడిగితే లేదని చెబుతారు. రిమాండ్ అడిగితే లేదని చెబుతారు. వాస్తవాలు ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి ఉందన్నారు.
చంద్రబాబును ఇంటరాగేషన్ కోసం రెండు రోజులు తీసుకున్నారు. 33 ప్రశ్నలు వేశారు. సీఐడీ అధికారులందరూ కలిసి ప్రశ్నించారు. ఒక్క ప్రశ్న అయినా సరే.. అవినీతి జరిగింది అని.. ఆ డబ్బులు టీడీపీకో, చంద్రబాబుకో, వ్యాపారానికో, ఫ్యామిలీకో ఆధారం చూపలేదు. ఈ పోస్ట్ చేశారు. తనిఖీ చేయలేదు. దీని పై పర్యవేక్షించలేదు. చంద్రబాబు స్కామ్ కు పాల్పడ్డాడని ఆధారాలు లేవు అని స్పస్టం చేశారు అచ్చెన్నాయుడు. ప్రతీ క్వశ్ఛన్ కి సమాధానం ఇస్తామని చెప్పారు. దారుణంగా జగన్ కావాలని చెప్పి.. 16 నెలలు జైలులో ఉన్నాను. చంద్రబాబును కూడా జైలులో ఉంచాలనే ఉద్దేశంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు.