నాకు, నా కొడుకుకు కాంగ్రెస్‌ టికెట్లు వస్తాయి – మైనంపల్లి హన్మంతరావు

-

నాకు, నా కొడుకుకు కాంగ్రెస్‌ టికెట్లు వస్తాయంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంత రావు. డిల్లీలోని ఖర్గే నివాసంలో మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

mynampalli
mynampalli

ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని… కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంత రావు.. సర్వేల ఆధారంగా అధిష్టానమే సీట్లపై నిర్ణయం ఉంటుందని.. సర్వే ఫలితాల ఆధారంగా మేము అభ్యర్థులుగా ఉండబోతున్నామని వెల్లడించారు.

బీఆర్‌ఎస్ లో ఎంత చెయ్యాల్నో అంత చేశానని…నా వర్క్ తోనే లీడర్లు గెలిచారని వెల్లడించారు. క్యాడర్ నాతోనే ఉంది…. కార్యకర్తగా నన్ను నేను నిరూపించుకుంటానని ప్రకటించారు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంత రావు. కాగా… గత వారం రోజుల కిందటే…అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంత రావు… రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news