ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినేట్ సమావేశం రద్దు

-

ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఇవాళ జరుగాల్సిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయిందని సమాచారం.

అయితే.. ఇవాళ జరుగాల్సిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయినట్లు సీఎంవో అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ 29.9.2023 నాడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నదన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం నిరాధారమైనదంటూ తెలంగాణ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది.

కాగా, మంత్రి కేటీఆర్ ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,  గంగుల కమలాకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి తొలత కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం పెద్దపమందడి మండలం బుగ్గపల్లి తండాలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం, రాజపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news